రాంచీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 30–26 తేడాతో జైపూర్ పింక్‌పాంథర్స్‌పై నెగ్గింది. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 46–41 తేడాతో పట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది. నేడు జరిగే మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీతో యు ముంబా జట్టు తలపడుతుంది.