సాక్షి, హైదరాబాద్: అఖిల భారత రాజీవ్ గాంధీ అండర్-19 జాతీయ, అంతర్జాతీయ టి20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం తెలంగాణ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 25 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు 16 ఓవర్లలో 9 వికెట్లకు 112 పరుగులు చేసింది. సాయి ప్రజ్ఞయ్ రెడ్డి (35) వేగంగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లలో ప్రత్యూష్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం తెలంగాణ జట్టు 15.5 ఓవర్లలో 87 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. చరణ్ (24) పోరాడాడు. హైదరాబాద్ బౌలర్లలో ఆశిష్, అంకేత్ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, రాజస్తాన్, జట్లు కూడా సెమీస్‌లో అడుగుపెట్టాయి.
హైదరాబాద్ విజయం
Published Sat, Jan 21 2017 10:32 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement