బ్రాడ్ మన్ ఇంట్లో సచిన్ ఫోటో...
ముంబై: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం సర్ డొనాల్డ్ బ్రాడ్ మన్ రూపొందించిన పదకొండు మంది ఆల్ టైమ్ టెస్ట్ క్రికెటర్ల జాబితాలో తన ఫోటో ఉండటం గొప్ప అదృష్టమని సచిన్ టెండూల్కర్ అన్నారు. బ్రాడ్ మన్ ఇంట్లో తన ఫోటో ఉండటం తనకు లభించిన అత్యుత్తమ గౌరవమని సచిన్ తెలిపారు.
తనకు లభించిన అభినందనల్లో బ్రాడ్ మన్ ఇచ్చిన కాంప్లిమెంటే అత్యుత్తమని లిటిల్ మాస్టర్ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని టోని అబాట్ సమక్షంలో ఆదేశ కాన్సులేట్ నిర్వహించిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న సచిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.