క్రైస్ట్‌చర్చ్: తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమి నుంచి భారత పురుషుల హాకీ జట్టు తేరుకుంది. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. దాంతో నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రెండు జట్లు 1-1తో సమఉజ్జీగా నిలిచాయి. తొలి మ్యాచ్‌లో భారత్ 0-2తో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో భారత్ ఆద్యంతం దూకుడుగా ఆడింది.13వ నిమిషంలో బీరేంద్ర లాక్రా అందించిన పాస్‌ను రమణ్‌దీప్ సింగ్ గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత 45వ నిమిషంలో కేన్ రసెల్ గోల్‌తో న్యూజిలాండ్ స్కోరును 1-1తో సమం చేసింది. అయితే ఏడు నిమిషాల తర్వాత లలిత్ ఉపాధ్యాయ్ గోల్‌తో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి నిమిషంలో నికిన్ తిమ్మయ్య గోల్ చేయడంతో భారత్ విజయం ఖాయమైంది. శుక్రవారం ఇదే వేదికపై మూడో మ్యాచ్ జరుగుతుంది.
న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు
Published Thu, Oct 8 2015 2:12 AM | Last Updated on Sun, Sep 3 2017 10:35 AM
Advertisement
Advertisement