దుబాయ్‌లోనూ అదే ఊపు | Indian Aces lead the way as the IPTL heads to Dubai for exciting finale | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లోనూ అదే ఊపు

Published Fri, Dec 12 2014 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 6:00 PM

దుబాయ్‌లోనూ అదే ఊపు

దుబాయ్‌లోనూ అదే ఊపు

సింగపూర్ స్లామర్స్‌పై ఇండియన్ ఏసెస్ గెలుపు  
 ఐపీటీఎల్
 
 దుబాయ్: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ తిరుగులేని ఆధిక్యంతో దూసుకెళుతోంది. గురువారం ప్రారంభమైన దుబాయ్ అంచె తొలి పోటీలో ఏసెస్ 28-24తో సింగపూర్ స్లామర్స్‌పై నెగ్గింది. దీంతో 34 పాయింట్లతో ఏసెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
 
  పురుషుల సింగిల్స్ మినహా అన్ని మ్యాచ్‌లను ఏసెస్ గెల్చుకోవడం విశేషం. ముందుగా మహిళల సింగిల్స్‌లో అనా ఇవనోవిచ్ 6-5తో హంటుచోవాపై నెగ్గింది. ఆ తర్వాత పురుషుల లెజెండ్స్‌లో సాంటోరో 6-3తో ప్యాట్రిక్ రాఫ్టర్‌పై గెలువగా... మిక్స్‌డ్ డబుల్స్‌లో బోపన్న-సానియా జంట 6-5తో సోర్స్-హంటుచోవాపై గెలిచింది. పురుషుల డబుల్స్‌లో మోన్‌ఫిల్స్-బోపన్న 6-3తో హెవిట్-సోర్స్‌పై  నెగ్గి స్పష్టమైన ఆధిక్యాన్ని అందించారు. అయితే చివరి మ్యాచ్ అయిన పురుషుల సింగిల్స్‌లో మోన్‌ఫిల్స్ 4-8తో బెర్డిచ్ చేతిలో ఓడాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement