
కౌలూన్ (హాంకాంగ్) : భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ హాంకాంగ్ సూపర్ సిరీస్‌లో రన్నరప్‌గా నిలిచారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెం1 ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో 18-21,18-21 తేడాతో వరుస సెట్లలో పరాజయం పొందారు.
సింధూ తై జు యింగ్‌కు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. గత ఏడాది రియో ఒలింపిక్స్‌లో తై జు యింగ్‌ను చివరిసారి ఓడించిన సింధు ఆ తర్వాత ఆమెతో తాజాగా జరిగిన మ్యాచ్‌తో కలిపి నాలుగు సార్లు ఓటమి పాలయ్యారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 21–17, 21–17తో ప్రపంచ మాజీ చాంపియన్, మాజీ నంబర్‌వన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)ను ఓడించి ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment