సైనా శుభారంభం | Indonesia Open: Saina Nehwal hopes to grab first title of season | Sakshi
Sakshi News home page

సైనా శుభారంభం

Published Wed, Jun 1 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

సైనా శుభారంభం

సైనా శుభారంభం

జకార్తా: మూడుసార్లు చాంపియన్ సైనా నెహ్వాల్ ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఎనిమిదో సీడ్ సైనా 21-11, 19-21, 21-15తో ప్రపంచ 23వ ర్యాంకర్ పాయ్ యు పో (చైనీస్ తైపీ)పై గెలిచింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గినా... రెండో గేమ్‌లో తడబడింది. నిర్ణాయక మూడో గేమ్‌లోనూ సైనాకు గట్టిపోటీ లభించింది. స్కోరు 13-13 వద్ద ఉన్నపుడు సైనా వరుసగా ఐదు పాయింట్లు గెలిచి ఆధిక్యంలోకి వెళ్లింది.

అదే ఊపులో గేమ్‌తోపాటు విజయాన్ని దక్కించుకుంది. బుధవారం జరిగే రెండో రౌండ్‌లో ఫిత్రియాని ఫిత్రియాని (ఇండోనేసియా)తో సైనా ఆడుతుంది. మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-మనూ అత్రి (భారత్) ద్వయం తొలి రౌండ్‌లో 14-21, 25-27తో యోంగ్ కాయ్ టెర్రీ హీ-వీ హాన్ తాన్ (సింగపూర్) జోడీ చేతిలో ఓడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement