చాంప్‌ రాజేంద్రనగర్‌ కాలేజి | inter college sports champ rajendranagar college | Sakshi
Sakshi News home page

చాంప్‌ రాజేంద్రనగర్‌ కాలేజి

Published Wed, Feb 22 2017 4:42 PM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM

చాంప్‌ రాజేంద్రనగర్‌ కాలేజి

చాంప్‌ రాజేంద్రనగర్‌ కాలేజి

ఇంటర్‌ కాలేజి స్పోర్ట్స్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ అగ్రికల్చరల్‌ కాలేజి స్పోర్ట్స్‌ మీట్‌లో రాజేంద్రనగర్‌ వ్యవసాయ కళాశాల సత్తా చాటుకుంది. బాలుర విభాగంలో ఈ కాలేజి జట్టు విజేతగా నిలిచింది. బాలికల ఈవెంట్‌లో అశ్వరావు పేట అగ్రికల్చరల్‌ కాలేజి చాంపియన్‌షిప్‌ సాధించింది. ఇదే కాలేజికి చెందిన రాజేశ్‌ అథ్లెటిక్స్‌లో చాంపియన్‌గా నిలిచాడు. ఐదు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8 వ్యవసాయ కాలేజీలకు చెందిన 550 మంది బాలబాలికలు పాల్గొన్నారు. మొత్తం 17 క్రీడాంశాల్లో పోటీలు  నిర్వహించారు.

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్ర మానికి వర్సిటీ డీన్‌ కె.ఎస్‌. డాంగి, పాలకమండలి సభ్యులు మనోహర్‌ రావు, సురేందర్‌ రాజు, అసోసియేట్‌ డీన్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి, ఇన్‌చార్జి ఫిజికల్‌  డైరెక్టర్‌ విద్యాసాగర్, శ్యామ్యూల్, మృణాళిని, సుజాత, చేరాలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement