
పసర్ షమీకి కూతురు
కోల్‌కతా: గాయం నుంచి కోలుకుంటున్న భారత క్రికెట్ జట్టు పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి రంజాన్ మాసం మరో శుభవార్తను తీసుకొచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం అతడి భార్య హసీన్ జహాన్... కూతురికి జన్మనిచ్చింది.
ఇది వారికి తొలి సంతానం. తల్లీ కూతురు క్షేమంగా ఉన్నారని షమీ తెలిపాడు. గతేడాది జూన్‌లో షమీ వివాహం జరిగింది. ఇటీవల తన ఎడమ మోకాలికి శస్త్ర చికిత్స కావడంతో మూడు నెలలుగా షమీ జట్టుకు దూరంగా ఉంటున్నాడు.