జోఫ్రా ఆర్చర్(ఫైల్‌ఫొటో)
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అనేది అనామక క్రికెటర్లను సైతం రాత్రికి రాత్రికే కోటీశ్వరుల్ని చేస్తుందనేది మరోసారి రుజువైంది. వెస్టిండీస్ అండర్-19 క్రికెట్ జట్టులో సభ్యుడిగా కొనసాగుతున్న జోఫ్రా ఆర్చర్‌ను ఒక్కసారిగా స్టార్‌ను చేసింది ఈ ఐపీఎల్ సీజన్. ఐపీఎల్-11కు సంబంధించి ఈ రోజు బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో ఆర్చర్‌కు రూ. 7.20 కోట్ల రికార్డు ధర పలికింది. ఇటీవల కాలంలో అటు బ్యాట్‌తోనూ, ఇటు బంతితోనూ సత్తాచాటుతున్న బార్బోడాస్‌కు చెందిన ఆర్చర్‌ను అత్యధిక మొత్తం చెల్లించి రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఆర్చర్ కనీస ధర రూ. 40 లక్షలు ఉండగా ఒకేసారి రికార్డు స్థాయిలో కోట్లను వెచ్చించి మరీ రాయల్స్ కొనుగోలు చేసింది.
ఇంతకీ జోఫ్రా ఆర్చర్ ఎవరు..?
ట్వంటీ స్పెషలిస్టుగా ముద్రపడిన ఆర్చర్..2016లో ససెక్స్ తరపున ఆడటానికి సంతకం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. 2017 సంవత్సరానికి సంబంధించి ఇంగ్లిస్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్ తరపున అత్యధిక వికెట్లను సాధించి సత్తా చాటుకున్నాడు. కాగా, గత రెండు నెలల నుంచి అతనికి మరింత స్టార్ డమ్ వచ్చి పడింది. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా హోబార్ట్ హరికేన్స్‌కు ప్రాతినిథ్య వహించిన ఆర్చర్..తొలి మ్యాచ్‌లోనే రెండు వికెట్లు సాధించి ఆకట్టుకున్నాడు. బీబీఎల్‌లో 10 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు సాధించి తనదైన ముద్రను వేశాడు. గంటకు 140 కి.మీపైగా వేగంతో బౌలింగ్ వేయడమే ఆర్చర్‌కు అదనపు బలం. ప్రధానంగా యార్కర్లు, బౌన్సర్లు సంధించడంలో దిట్ట. 34 ట్వంటీ 20 మ్యాచ్‌ల్లో 40కి పైగా వికెట్లు సాధించాడు.మరొకవైపు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌లో అతని టీ 20 స్టైక్‌రేట్ 145. 45 గా ఉంది. వీటిన దృష్టిలో పెట్టుకున్న రాజస్థాన్ రాయల్స్ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ఈ 22 ఏళ్ల క్రికెటర్‌కు భారీ మొత్తం చెల్లించి దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment