ఐపీఎల్‌ చరిత్రలో ఐదో ఆటగాడిగా.. | Kane Williamson becomes 5th player to score 700 plus Runs in an IPL Season | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ చరిత్రలో ఐదో ఆటగాడిగా..

Published Sun, May 27 2018 8:22 PM | Last Updated on Sun, May 27 2018 8:25 PM

  Kane Williamson becomes 5th player to score 700 plus Runs in an IPL Season - Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఒక సీజన్‌లో ఏడొందలకు పైగా పరుగులు సాధించిన ఐదో ఆటగాడిగా విలియమ్సన్‌ గుర్తింపు సాధించాడు. ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న ఫైనల్లో మ్యాచ్‌ ద్వారా విలియమ్సన్‌ ఈ ఫీట్‌ను నమోదు  చేశాడు. ఈ సీజన్‌లో విలియమ్సన్‌ సాధించిన పరుగులు 735. చెన్నైతో ఫైనల్‌ మ్యాచ్‌లో విలియమ్సన్‌(47) మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.

కాగా, అంతకుముందు విరాట్‌ కోహ్లి(973-2016), డేవిడ్‌ వార‍్నర్‌(848-2016),  మైక్‌ హస్సీ(733-2013)లు తలో ఒకసారి ఏడొందలకు పైగా పరుగులను సాధించగా, క్రిస్‌ గేల్‌(733-2012; 708-2013) రెండు సార్లు ఈ ఘనతను సాధించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement