సాక్షి, హైదరాబాద్: ముస్తాక్ అలీ టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హైదరాబాద్‌కు తొలి ఓటమి ఎదురైంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక జట్టు 14 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కర్ణాటక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (55 బంతుల్లో 65; 7 ఫోర్లు) అర్ధసెంచరీ చేయగా... పవన్ దేశ్‌పాండే (24 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. అనంతరం 149 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. అక్షత్‌రెడ్డి (32 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకోగా... బద్రీనాథ్ (31 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు) చివరి వరకు పోరాడాడు. కర్ణాటక బౌలర్లలో అరవింద్ 3, సుచిత్ 2 వికెట్లు దక్కించుకున్నారు.
మయాంక్ అద్భుత ఇన్నింగ్స్
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక జట్టుకు హసన్ ఆరంభంలోనే షాకిచ్చాడు. ఓపెనర్ సుచిత్ (1), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ సమర్థ్ (10)లను హసన్ ఔట్ చేయడంతో 24 పరుగులకే కర్ణాటక జట్టు 2 వికెట్లను కోల్పోరుుంది. మరో ఓపెనర్ మయాంక్ ఆచితూచి ఆడగా... కరుణ్ నాయర్ (12) నిరాశపరిచాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పవన్ దేశ్‌పాండే, మయాంక్‌కు చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్ట్రరుుక్ రొటేట్ చేశారు. ఈ జంట 46 బంతుల్లోనే 63 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత మిలింద్ బౌలింగ్‌లో అనిరుధ్‌కు క్యాచ్ ఇచ్చి పవన్ పెవిలియన్‌కు చేరాడు. తర్వాత గౌతమ్ (2), వినయ్ కుమార్ (2)లు నిరాశ పరిచినా....మయాంక్ టి20ల్లో పదో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్లో మయాంక్... హసన్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు.
మిడిలార్డర్ వైఫల్యం
సాధారణ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (22), అక్షత్ శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం కేవలం ఆరు బంతుల వ్యవధితో వీరిద్దరిని ఔట్‌చేసి కర్ణాటక జట్టు రేసులోకి వచ్చింది. ఆ తర్వాత అనిరుధ్ (22) కూడా పెవిలియన్ చేరడంతో జట్టు కష్టాల్లో పడింది. ఓ ఎండ్‌లో బద్రీనాథ్ ధాటిగా ఆడినా ... మరో ఎండ్‌లో సందీప్ (6), ఆకాశ్ భండారి (0), సుమంత్ (1), హసన్ (3) విఫలం కావడంతో హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు.
స్కోరు వివరాలు
కర్ణాటక ఇన్నింగ్‌స: మయాంక్ అగర్వాల్ (సి) సుమంత్ (బి) సిరాజ్ 65; సుచిత్ (స్టంప్డ్) సుమంత్ (బి) హసన్ 1; సమర్థ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హసన్ 10; నాయర్ (సి) సుమంత్ (బి) మిలింద్ 12; పవన్ (సి) అనిరుధ్ (బి) మిలింద్ 32; గౌతమ్ (సి) సిరాజ్ (బి) భండారి 2; వినయ్ (స్టంప్డ్) సుమంత్ (బి) హసన్ (2); జోషి (14 నాటౌట్), గౌతమ్ (4 నాటౌట్); ఎక్స్‌ట్రాలు 6; మొత్తం 20 ఓవర్లలో 7 వికెట్లకు 148.
వికెట్ల పతనం: 1-4, 2-24, 3-49, 4-112, 5-116, 6-120, 7-142.
బౌలింగ్: రవికిరణ్ 4-0-51-0, హసన్ 4-0-16-3, మిలింద్ 4-0-19-2, సిరాజ్ 4-0-32-1, భండారి 4-0-28-1.
హైదరాబాద్ ఇన్నింగ్‌స: తన్మయ్ (సి) జోషి (బి) సుచిత్ 22; అక్షత్ (సి) ప్రదీప్ (బి) అరవింద్ 42; బద్రీనాథ్ 37నాటౌట్; అనిరుధ్ (స్టంప్డ్) గౌతమ్ (బి) సుచిత్ 22; సందీప్ (సి) సమర్థ్ (బి) అరవింద్ 6; భండారీ (సి) వినయ్ (బి) అరవింద్ 0; సుమంత్ (సి) గౌతమ్ (బి) వినయ్ 1; హసన్ 1 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం 20 ఓవర్లలో 6 వికెట్లకు 134.
వికెట్ల పతనం: 1-66, 2-72, 3-105, 4-127, 5-128, 6-131.
బౌలింగ్: ప్రదీప్ 3-0-20-0, వినయ్: 4-0-26-1, అరవింద్ 3-0-25-3, గౌతమ్ 4-0-30-0, సుచిత్ 4-0-18-2, పవన్ 2-0-12-0.
హైదరాబాద్ జోరుకు బ్రేక్
Published Fri, Feb 3 2017 12:22 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement