కశ్యప్‌ రాణించేనా? | kasyap ready to canada open | Sakshi
Sakshi News home page

కశ్యప్‌ రాణించేనా?

Published Tue, Jul 11 2017 10:39 AM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM

కశ్యప్‌ రాణించేనా?

కశ్యప్‌ రాణించేనా?

న్యూఢిల్లీ: ఈ సీజన్‌లో తొలి టైటిలే లక్ష్యంగా హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పారుపల్లి కశ్యప్‌ కెనడా ఓపెన్‌ గ్రాండ్‌ ప్రి టోర్నీ బరిలోకి దిగుతున్నాడు. కెనడాలోని కాల్గరీ నగరంలో నేటి నుంచి జరిగే ఈ టోర్నీలో తొలి రోజు క్వాలిఫయింగ్‌ పోటీలు, బుధవారం నుంచి మెయిన్‌ ‘డ్రా’ మ్యాచ్‌లు జరుగుతాయి. మేటి ఆటగాళ్లను ఓడిస్తూ ఇటీవల సంచలన ప్రదర్శన చేసిన మరో భారత ఆటగాడు ప్రణయ్‌ ఈ టోర్నీలో రెండో సీడ్‌గా, కశ్యప్‌ 16వ సీడ్‌గా బరిలోకి దిగుతున్నారు. ఈ టోర్నీలో తెలుగు రాష్ట్రాల నుంచి రుత్విక శివాని, సిక్కి రెడ్డి, శ్రీకృష్ణప్రియ, సాయి ఉత్తేజిత రావులు తలపడనున్నారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్‌ చోప్రా జంటకు రెండో సీడ్‌ దక్కింది.

గతేడాది ఈ టోర్నీలో భమిడిపాటి సాయిప్రణీత్‌ సింగిల్స్‌ టైటిల్‌ను, మను అత్రి–సుమిత్‌ రెడ్డిలు డబుల్స్‌ టైటిల్‌ను గెలుచుకున్నారు. ఈసారి సాయిప్రణీత్‌ గైర్హాజరు కాగా, మూడో సీడ్‌గా బరిలోకి దిగుతున్న మను అత్రి–సుమిత్‌ జంట టైటిల్‌ నిలబెట్టుకోవాలని చూస్తోంది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ప్రణయ్‌... క్యాస్టిలో (మెక్సికో)తో, కశ్యప్‌... డానియెల్‌ టొరె రీగల్‌ (పెరూ)తో ఆడతారు. మహిళల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో జాతీయ చాంపియన్‌ రీతూపర్ణ దాస్‌... హరుకొ సుజుకి (జపాన్‌)తో, సాయి ఉత్తేజిత రావు... రాచెల్‌ హండెరిచ్‌ (కెనడా)తో, రుత్వికా శివాని... గా యున్‌ కిమ్‌ (కొరియా)తో పోటీపడతారు. పురుషుల డబుల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్స్‌ మను అత్రి–సుమిత్‌ జోడీ... కొహెయి గొండొ–తత్సుయా వతనబే (జపాన్‌) జంటపై గెలిచి శుభారంభం చేయాలని భావిస్తోంది.

 

Advertisement

పోల్

Advertisement