ఇండోర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్‌లో కింగ్స్ పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను సాధించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దాంతో ఈ సీజన్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలను సాధించిన రాహుల్... వరుసగా మూడు హాఫ్ సెంచరీలు కొట్టిన ఐదో ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. ఈ సీజన్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు కొట్టిన ఆటగాళ్లలో రాహుల్ కంటే ముందు క్రిస్ గేల్, కేన్ విలియమ్సన్, శ్రేయస్ అయ్యర్, జోస్ బట్లర్‌లు ఉన్నారు.
కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్దేశించిన 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కింగ్స్ పంజాబ్ తొలి వికెట్‌కు 57 పరుగులు సాధించిన తర్వాత గేల్(21) వికెట్‌ను కోల్పోయింది. ఆపై మరుసటి బంతికే మయాంక్ అగర్వాల్ గోల్డన్ డక్‌గా ఔటయ్యాడు. దాంతో కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను రాహుల్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే 22 బంతుల్లో అర్థ శతకం నమోదు చేశాడు. రాహుల్ (66;29 బంతుల్లో 2 ఫోర్లు 7 సిక్సర్లు) నాల్గో వికెట్‌గా పెవిలియన్ చేరడంతో కింగ్స్ పంజాబ్ 93 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను నష్టపోయింది.
Comments
Please login to add a commentAdd a comment