బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఆదివారం ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి(68 నాటౌట్; 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా బ్యాటింగ్ చేయగా, బ్రెండన్ మెకల్లమ్(38;28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డీకాక్(29;27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)లు ఫర్వాలేదనిపించారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను మెకల్లమ్, డీకాక్‌లు దూకుడుగా ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 67 పరుగులు జత చేసిన తర్వాత డీకాక్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటి మెకల్లమ్, మనన్ వోహ్రాలు వరుస బంతుల్లో ఔటయ్యారు. ఆండ్రీ రస్సెల్ వేసిన 10 ఓవర్ ఐదో బంతికి మెకల్లమ్ పెవిలియన్‌కు చేరగా, ఆ తదుపరి బంతికి వోహ్రా డకౌట్‌గా ఔటయ్యాడు. దాంతో 75 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో కోహ్లి-మన్‌దీప్ సింగ్‌ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. వీరు 65 పరుగుల జత చేసిన తర్వాత మన్‌దీప్ సింగ్(19) ఔట్ కాగా, గ్రాండ్ హోమ్‌తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలోనే కోహ్లి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. చివరి ఓవర్‌లో ఆర్సీబీ 16 పరుగులు పిండుకుంది. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment