లలిత్‌కు ఆరో స్థానం | Lalit to sixth palce | Sakshi
Sakshi News home page

లలిత్‌కు ఆరో స్థానం

Published Tue, Jan 17 2017 12:07 AM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM

Lalit to sixth palce

న్యూఢిల్లీ: పార్శ్వనాథ్‌ ఢిల్లీ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ఎం.ఆర్‌.లలిత్‌ బాబు 7.5 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో నిలిచాడు. పది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో తజకిస్తాన్‌ గ్రాండ్‌మాస్టర్‌ ఫారూఖ్‌ అమోనతోవ్‌ 8.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. 8 పాయింట్లతో దీప్తాయన్‌ ఘోష్‌ (భారత్‌), జుమయెవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. కేటగిరీ ‘సి’లో హైదరాబాద్‌ ప్లేయర్‌ షణ్ముఖ తేజ 8.5 పాయింట్లతో 8వ స్థానాన్ని పొందాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement