సెమీస్‌కు పేస్ జోడి | Leander Paes-Raven Klaasen enter Chennai Open semifinals | Sakshi
Sakshi News home page

సెమీస్‌కు పేస్ జోడి

Published Fri, Jan 9 2015 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM

సెమీస్‌కు పేస్ జోడి

సెమీస్‌కు పేస్ జోడి

* భూపతి-సాకేత్ జంటపై గెలుపు
* చెన్నై ఓపెన్

చెన్నై: చెన్నై ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్‌లో దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్, రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జోడి డబుల్స్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో మహేశ్ భూపతి, సాకేత్ మైనేని జంటను 1-6, 6-1, 10-7 తేడాతో పేస్ జోడి ఓడించింది. గంటా 15 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో భూపతి, సాకేత్ జంట కీలక సమయాల్లో అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. తొలి సెట్‌ను ఈ జోడి తేలిగ్గా గెలుచుకున్నప్పటికీ రెండో సెట్‌లో మాత్రం చేతులెత్తేసింది. దీంతో మ్యాచ్ నిర్ణాయక మూడో సెట్‌కు వెళ్లింది.

ఇక్కడ హోరాహోరీ పోరు ఎదురైనా పేస్ తన అనుభవాన్ని జత చేసి మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. సింగిల్స్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ రాబర్టో బటిస్టా అగట్ (స్పెయిన్) 6-3, 6-2తో పీటర్ గోజోసిక్ (జర్మనీ)పై, యెన్ సున్ లు 6-4, 6-4తో పాబ్లో కారెనో బుస్టా (స్పెయిన్)పై గెలిచారు. గిలెర్మో గార్షియా లోపెజ్ 6-7 (1), 6-2, 6-0తో ఇటో తట్సుమా (జపాన్)ను ఓడించి క్వార్టర్స్‌కు చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement