సాక్షి, హైదరాబాద్: జి. వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 క్రికెట్ లీగ్‌లో ఎంఎల్‌ఆర్ రాయల్స్ మహబూబ్‌నగర్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. సిద్ధిపేట్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కరీంనగర్ వారియర్స్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కరీంనగర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 141 పరుగులు సాధించింది. టి. రాజు (42 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. బుద్ధి రాహుల్ (35; 3 ఫోర్లు, 1 సిక్స్), అమోల్ షిండే (23; 2 ఫోర్లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో అజయ్ దేవ్ గౌడ్ 3 వికెట్లు పడగొట్టగా, అబ్దుల్ రహీమ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం ఠాకూర్ తిలక్ వర్మ (39 బంతుల్లో 59 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో మహబూబ్‌నగర్ జట్టు 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. మొహమ్మద్ షకీర్ ఖాన్ (29; 1 ఫోర్, 2 సిక్సర్లు), నీల్ కమల్ (28; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించిన ఠాకూర్ తిలక్ వర్మ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును గెలుచుకున్నాడు.
ఆదిలాబాద్ టైగర్స్ గెలుపు
మరోవైపు ఆదిలాబాద్ టైగర్స్ జట్టు టోర్నీలో తొలి విజయాన్ని సాధించింది. సిద్ధిపేట్‌లోనే జరిగిన ఈ మ్యాచ్‌లో బౌలర్ కరణ్ కన్నన్ (4/9) విజృంభించడంతో 124 పరుగుల తేడాతో కాకతీయ కింగ్స్‌ను చిత్తుగా ఓడించింది. తొలుత ఆదిలాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులు చేసింది. బెంజమిన్ (62 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు) ఆకట్టుకోగా... నీరజ్ బిస్త్ (27 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. సాగర్ చౌరాసియా (33; 5 ఫోర్లు) రాణించాడు. అనంతరం 125పరుగుల స్వల్ప లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన కాకతీయ కింగ్స్‌ను కరణ్ దెబ్బ తీశాడు. అతని ధాటికి కాకతీయ జట్టు 16.1 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన కరణ్ కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. జి. సదన్ రెడ్డి 2 వికెట్లు తీశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కరణ్‌కు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment