
జయవర్ధనే అజేయ శతకం
కొలంబో: శ్రీలంక సీనియర్ బ్యాట్స్‌మన్ మహేల జయవర్ధనే టెస్టుల్లో 34వ సెంచరీని సాధించాడు. 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి అడుగుపెట్టిన 37 ఏళ్ల ఈ వెటరన్ అత్యంత కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును నిలబెట్టాడు.
దీంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి లంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 5 వికెట్లకు 305 పరుగులు చేసింది. క్రీజులో జయవర్ధనే (225 బంతుల్లో 140 బ్యాటింగ్; 16 ఫోర్లు; 1 సిక్స్), డిక్‌వెల్లా (30 బంతుల్లో 12 బ్యాటింగ్; 1 ఫోర్) ఉన్నారు.