
షుమాకర్‌కి అరుదైన గౌరవం
మనామా (బహ్రెయిన్): ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్‌కు అరుదైన గౌరవం లభించింది. బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి సర్క్యూట్ తొలి మలుపునకు షుమాకర్ పేరు పెట్టనున్నారు. ఈ మేరకు షుమాకర్ కుటుంబసభ్యుల అనుమతి కూడా తీసుకున్నారు. ఈ సర్క్యూట్ నిర్మాణానికి సూచనలు చేసినందుకు నిర్వాహకులు షుమాకర్ పేరు పెట్టారు.
ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన షుమాకర్ ప్రస్తుతం జర్మనీలోని ఓ ఆస్పత్రిలో కోమాలో ఉన్నాడు. గత డిసెంబర్‌లో స్కీయింగ్ చేస్తూ అతను తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. కోమాలో ఉన్న ఫార్ములావన్ స్టార్ త్వరగా కోలుకోవాలని బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి నిర్వాహకులు ఆకాంక్షించారు. 2004లో తొలిసారి జరిగిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి రేసులో షుమాకర్ విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లో ఈ రేసు ఏప్రిల్ 6న జరుగుతుంది.