బంజారాహిల్స్, న్యూస్‌లైన్: రాష్ట్రానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్‌ను ఏపీ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు, కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ ప్రత్యేకంగా అభినందించారు.
ఇటీవల జరిగిన వరల్డ్ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో జరీన్ రజత పతకం గెలుచుకుంది. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో జరీన్‌కు రూ. 50 వేల నగదు ప్రోత్సాహకాన్ని నాగేందర్ అందజేశారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏపీ బాక్సింగ్ సంఘం ప్రతినిధులు, కోచ్‌లు పాల్గొన్నారు.
నిఖత్ జరీన్‌కు నజరానా
Published Mon, Oct 7 2013 12:21 AM | Last Updated on Thu, Mar 28 2019 5:23 PM
Advertisement
Advertisement