లండన్: స్పెయిన్ వర్ధమాన టెన్నిస్ తార గాబ్రినె ముగురుజ వయసు 21. అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ గెల్చుకున్న గ్రాండ్స్లామ్స్ సింగిల్స్ టైటిల్స్ (21) సంఖ్యతో సమానం. ర్యాంకింగ్స్లో సెరెనా ప్రపంచ నెంబర్ కాగా ముగురుజ 20వ ర్యాంకర్. సెరెనాకు గ్రాండ్స్లామ్స్ టైటిల్స్ నెగ్గడం కొత్తకాదు. మొత్తం 36 గ్రాండ్స్లామ్ టైటిల్స్ను సాధించింది. అయితే ముగురుజ మొన్నటి వరకు పెద్దగా తెలియదు. ముగురుజ గ్రాండ్స్లామ్ ఈవెంట్లో ఫైనల్కు రావడం ఇదే తొలిసారి. అయితేనేం సెరెనాతో ముగురుజ నువ్వానేనా అన్నట్టు తలపడింది. సెరెనాకు చివరి వరకు ముచ్చెమటలు పట్టించింది.
వింబుల్డన్ ఓపెన్ మహిళల గ్రాండ్ స్లామ్ ఫైనల్లో సెరెనా విజేతగా నిలిచినా.. ముగురుజ ఆద్యంతం ఆకట్టుకుంది. పోరాటపటిమతో చివరి దాకా సెరెనాను నిలువరించింది. తొలిగేమ్ను ముగురుజ గెలిచి శుభారంభం చేసింది. అయితే సెరెనా పవర్ ముందు ఆమె పోరాటం ఫలించలేదు. సెరెనా 6-4తో తొలి సెట్ను సొంతం చేసుకుంది. రెండో సెట్లోనూ 5-1తో ముందంజ వేసింది. అయితే ఈ సమయంలో ముగురుజ వరుసగా మూడు గేమ్లు గెలిచి సెరెనాకు ముచ్చెమటలు పట్టించింది. సెట్ను 5-4కు తీసుకెళ్లింది. ఆ తర్వాత సెట్తో పాటు మ్యాచ్ను ఓడినా ముగురుజ క్రీడాభిమానుల మనసును గెల్చుకుంది. వింబుల్డన్ ద్వారా ఆమె టెన్నిస్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. టెన్నిస్ ప్రపంచానికి మరో స్టార్ వస్తుందనే ఆశలు రేకెత్తించింది. బెస్ట్ ఆఫ్ లక్ ముగురుజ.
గాబ్రినె ముగురుజ ప్రొఫైల్:
జన్మదినం 1993 అక్టోబర్ 8
స్వస్థలం: బార్సిలోనా, స్పెయిన్
వయసు 21
ప్రస్తుత ర్యాంక్ 20
కెరీర్ సింగిల్ టైటిల్స్
డబ్ల్యూటీఏ 1, ఐటీఎఫ్ 7
గ్రాండ్స్లామ్: వింబుల్డన్ రన్నరప్
శభాష్.. ముగురుజ
Published Sat, Jul 11 2015 8:20 PM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM
Advertisement
Advertisement