ముంబై దూకుడు | Mumbai versus New Zealand warm-up match Mumbai put us under pressure | Sakshi
Sakshi News home page

ముంబై దూకుడు

Published Sun, Sep 18 2016 1:44 AM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

ముంబై దూకుడు

ముంబై దూకుడు

సూర్యకుమార్, కౌస్తుభ్ సెంచరీలు
తొలి ఇన్నింగ్‌‌సలో 431/5 రోహిత్ విఫలం
న్యూజిలాండ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ 

 న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడారు. అరుుతే స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ మాత్రం విఫలమయ్యాడు. అటు కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ సూర్యకుమార్ యాదవ్ (86 బంతుల్లో 103; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), కౌస్తుభ్ పవార్ (228 బంతుల్లో 100; 15 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో రెచ్చిపోయారు. దీంతో ముంబై తమ తొలి ఇన్నింగ్‌‌సలో 103 ఓవర్లలో ఐదు వికెట్లకు 431 పరుగులు చేసింది.

అర్మాన్ జాఫర్ (123 బంతుల్లో 69; 9 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. క్రీజులో ఉన్న సిద్ధేష్ లాడ్ (62 బంతుల్లో 82 బ్యాటింగ్; 7 ఫోర్లు; 7 సిక్సర్లు), ఆదిత్య తారే (76 బంతుల్లో 53; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ప్రస్తుతం ముంబై 107 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్నా కివీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకున్న స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ ఈ ఫ్లాట్ పిచ్‌పై 40 బంతుల్లో 18 పరుగులే చేయగలిగాడు. కివీస్ తమ తొలి ఇన్నింగ్‌‌సను 324/7 వద్ద డిక్లేర్ చేసింది.

 చెలరేగిన సూర్యకుమార్
ఓవర్‌నైట్ స్కోరు 29/1తో శనివారం రెండో రోజు తమ తొలి ఇన్నింగ్‌‌స ఆరంభించిన ముంబై కివీస్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ వన్డే తరహాలో చెలరేగడంతో పరుగులు ధారాళంగా వచ్చారుు. బౌల్ట్, వాగ్నర్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న టీనేజ్ సంచలనం అర్మాన్, కౌస్తుబ్ రెండో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన రోహిత్ పదో బంతికి సిక్స్‌తో ఖాతా తెరిచినా విఫలమయ్యాడు.

అరుుతే పవార్‌కు, సూర్యకుమార్ జత కలవడంతో ఆట స్వ రూపం మారింది. పరుగుల ఖాతా తెరవక ముందే సూర్యకుమార్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను సోధి వదిలేయడంతో జట్టు తగిన మూల్యం చెల్లించింది. పేసర్లు బౌల్ట్, నీల్ వాగ్నర్‌తో పాటు ముగ్గురు స్పిన్నర్లను సూర్యకుమార్ ఓ ఆటాడుకున్నాడు. ఏకంగా 8 సిక్సర్లతో ఎదురుదాడికి దిగి వేగంగా సెంచరీ సాధిం చాడు. టీ విరామానంతరం తను సాన్‌ట్నర్ బౌలిం గ్‌లో వెనుదిరగ్గా అప్పటికే నాలుగో వికెట్‌కు 155 పరుగులు జోడించారు. ఆ తర్వాత పవార్ శతకం అనంతరం రిటైర్డ్ అవుట్‌గా పెవిలియన్‌కు చేరాడు. చివర్లో తారే, లాడ్ కూడా బౌలర్లకు చుక్కలు చూపిం చారు. ప్రస్తుతానికి ఆరో వికెట్‌కు వీరిద్దరూ అజేయం గా 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement