
ప్రతిష్టాత్మక ఐఏఏఎఫ్ డైమండ్ లీగ్ పోటీల్లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా త్రుటిలో పతకం కోల్పోయాడు. ఖతర్‌లోని దోహాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో 87.43 మీటర్లతో తన అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి నాలుగో స్థానంలో నిలిచాడు. భారత్ తరఫున ఇది కొత్త జాతీయ రికార్డు కూడా కావడం విశేషం. అయితే నీరజ్‌కు పతకం మాత్రం దక్కలేదు. జర్మనీకే చెందిన థామస్ రోహ్లర్ (91.78), జొహన్నెస్ వెటర్ (91.56), ఆండ్రియాస్ హాఫ్‌మన్ (90.08) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలను గెలుచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment