హాకీ చాంపియన్స్ ట్రోఫీకి మంగళం! | New Global Hockey League to replace Champions Trophy | Sakshi
Sakshi News home page

హాకీ చాంపియన్స్ ట్రోఫీకి మంగళం!

Published Sat, Apr 16 2016 12:58 AM | Last Updated on Sun, Sep 3 2017 10:00 PM

New Global Hockey League to replace Champions Trophy

 కొత్తగా జీహెచ్‌ఎల్
ఇపో (మలేసియా): అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్స్‌లో సమూల మార్పులు చేయబోతున్నారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న చాంపియన్స్ ట్రోఫీకి గుడ్‌బై చెప్పి దాని స్థానంలో కొత్తగా ‘గ్లోబల్ హాకీ లీగ్ (జీహెచ్‌ఎల్)ను ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) భావిస్తోంది. 2019లో ప్రవేశపెట్టనున్న ఈ లీగ్‌లో కేవలం ఏడు జట్లు మాత్రమే ఉంటాయని ఎఫ్‌ఐహెచ్ అధ్యక్షుడు లియోనాడ్రో నేగ్రి తెలిపారు. ఇంటా, బయటా పద్ధతిలో 4 నెలల పాటు పోటీలు ఉంటాయన్నారు. అంతర్జాతీయ హాకీ పోటీల పరివర్తనలో భాగమే ఈ జీహెచ్‌ఎల్ అని నేగ్రి స్పష్టం చేశారు.

‘కొత్త క్యాలెండర్‌లో హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్, ఫైనల్స్ ఉండవు. అయితే తక్కువ ర్యాంక్ దేశాలకు అంతర్జాతీయ అనుభవం కోసం రౌండ్-1, 2 పోటీలను కొనసాగిస్తాం. ఇక చాంపియన్స్ ట్రోఫీని కూడా కొనసాగించం. ఒలింపిక్స్, వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ పోటీల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి’ అని నేగ్రి పేర్కొన్నారు. 1978 నుంచి చాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. అయితే 2010లో హాకీ వరల్డ్ లీగ్ రావడంతో దీన్ని ద్వైవార్షిక ఈవెంట్‌గా మార్చారు.

Advertisement

పోల్

Advertisement