International hockey tournaments
-
వ్యాక్సిన్ వచ్చాకే టోర్నమెంట్లు
లుసానే: కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాకే అంతర్జాతీయ హాకీ టోర్నీలు జరుగుతాయని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) స్పష్టం చేసింది. ఈమేరకు వివిధ స్థాయిల్లో పోటీల పునరుద్ధరణ కోసం ‘ఐదు దశల ప్రక్రియ’ను అనుసరించబోతున్నామని ఎఫ్ఐహెచ్ ప్రకటించింది. ఈ ప్రక్రియ చివరి మెట్టుకి చేరుకున్నాక మాత్రమే అంతర్జాతీయ హాకీ టోర్నీలు నిర్వహించే పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొంది. ‘ఈ సమయంలో హాకీ పునరుద్ధరణ చాలా తొందరపాటే అవుతుంది. ఆటను మళ్లీ పాత పరిస్థితుల్లో నిర్వహించేలా ఐదు దశల ప్రక్రియను పాటించబోతున్నాం. తొలుత సామాజిక దూరం పాటిస్తూ శిక్షణను ప్రారంభిస్తాం. మరో దశలో రీజియన్ల స్థాయిలో పోటీలు నిర్వహిస్తాం. తదుపరి పొరుగు దేశాల్లో జరిగే టోర్నీల్లో తలపడతాం. ఆ తర్వాత ఖండాంతర పోటీలు... ఇలా చివరి దశలో వ్యాక్సిన్ వచ్చాకే పోటీ ప్రపంచంలో మళ్లీ అడుగుపెడతాం. అయితే ఒక్కో దశ ఎన్ని రోజులుంటుందనేది మాత్రం పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’ అని ఎఫ్ఐహెచ్ వివరించింది. అంతర్జాతీయ హాకీ పునరుద్ధరించాక కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకే నడుచుకుంటామని ఎఫ్ఐహెచ్ తెలిపింది. -
హాకీ చాంపియన్స్ ట్రోఫీకి మంగళం!
కొత్తగా జీహెచ్ఎల్ ఇపో (మలేసియా): అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్స్‌లో సమూల మార్పులు చేయబోతున్నారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న చాంపియన్స్ ట్రోఫీకి గుడ్‌బై చెప్పి దాని స్థానంలో కొత్తగా ‘గ్లోబల్ హాకీ లీగ్ (జీహెచ్ఎల్)ను ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) భావిస్తోంది. 2019లో ప్రవేశపెట్టనున్న ఈ లీగ్‌లో కేవలం ఏడు జట్లు మాత్రమే ఉంటాయని ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడు లియోనాడ్రో నేగ్రి తెలిపారు. ఇంటా, బయటా పద్ధతిలో 4 నెలల పాటు పోటీలు ఉంటాయన్నారు. అంతర్జాతీయ హాకీ పోటీల పరివర్తనలో భాగమే ఈ జీహెచ్ఎల్ అని నేగ్రి స్పష్టం చేశారు. ‘కొత్త క్యాలెండర్లో హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్, ఫైనల్స్ ఉండవు. అయితే తక్కువ ర్యాంక్ దేశాలకు అంతర్జాతీయ అనుభవం కోసం రౌండ్-1, 2 పోటీలను కొనసాగిస్తాం. ఇక చాంపియన్స్ ట్రోఫీని కూడా కొనసాగించం. ఒలింపిక్స్, వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ పోటీల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి’ అని నేగ్రి పేర్కొన్నారు. 1978 నుంచి చాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. అయితే 2010లో హాకీ వరల్డ్ లీగ్ రావడంతో దీన్ని ద్వైవార్షిక ఈవెంట్‌గా మార్చారు.