రోస్బర్గ్కు నాలుగో పోల్
నేడు హంగేరి గ్రాండ్‌ప్రి
హంగారోరింగ్: ఈ సీజన్లో ఆరో టైటిల్‌ను సాధించేందుకు మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ కు మరో అవకాశం లభించింది. శనివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసు క్వాలిఫయింగ్ సెషన్లో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. క్వాలిఫయింగ్‌లో రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 19.965 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని సంపాదించాడు.
మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానం నుంచి, రికియార్డో (రెడ్‌బుల్) మూడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ తొమ్మిదో స్థానం నుంచి, సెర్గియో పెరెజ్ 13వ స్థానం నుంచి రేసును ప్రారంభిస్తారు. ఈ సీజన్లో రోస్‌బర్గ్‌కిది నాలుగో పోల్ కావడం విశేషం. ఈ రేసుకు ముందు పోల్ పొజిషన్‌తో మొదలుపెట్టిన మూడు రేసుల్లోనూ రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు.