హామిల్టన్‌కు ఆరో ‘పోల్’
సింగపూర్: ఈ సీజన్లో తన జోరు కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఆరోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. ఆదివారం జరిగే సింగపూర్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో ఈ బ్రిటన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 45.681 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), రికియార్డో (రెడ్‌బుల్), వెటెల్ (రెడ్‌బుల్), అలోన్సో (ఫెరారీ), మసా (విలియమ్స్), రైకోనెన్ (ఫెరారీ), బొటాస్ (విలియమ్స్), మాగ్నుసన్ (మెక్లారెన్), క్వియాట్ (ఎస్టీఆర్), బటన్ (మెక్లారెన్), జీన్ వెర్జెన్ (ఎస్టీఆర్), హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), గుటిరెజ్ (సాబెర్), పెరెజ్ (ఫోర్స్ ఇండియా), గ్రోస్యెన్ (లోటస్), సుటిల్ (సాబెర్), మల్డొనాడో (లోటస్), బియాంచి (మారుసియా), కొబయాషి (కాటర్‌హమ్), చిల్టన్ (మారుసియా), ఎరిక్సన్ (మారుసియా) వరుసగా 2 నుంచి 22 గ్రిడ్ పొజిషన్స్‌లో రేసును మొదలుపెడతారు.