సూపర్ లీగ్‌లో ఓయూ, జేఎన్‌టీయు జట్లు | OU and JNTU teams in super league | Sakshi
Sakshi News home page

సూపర్ లీగ్‌లో ఓయూ, జేఎన్‌టీయు జట్లు

Published Wed, Jan 8 2014 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM

OU and JNTU teams in super league

జింఖానా, న్యూస్‌లైన్:  సెంట్రల్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఉస్మానియా, జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్‌టీయు) జట్లు సూపర్ లీగ్‌కు చేరుకున్నాయి. ఈ టోర్నీని చత్తీస్‌గఢ్ లాన్ టెన్నిస్ సంఘం నిర్వహిస్తోంది. చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ యూనివర్సిటీలో జరుగుతున్న ఈ టోర్నీలో జేఎన్‌టీయూ జట్టు 2-1తో ఎల్‌ఎన్‌ఐపీఈ గ్వాలియర్‌పై నెగ్గింది. మొదట మల్లిక 6-3, 6-2తో నేహా నాయక్‌పై నెగ్గగా... సారిక 4-6, 4-6తో జ్యోతి చేతిలో ఓటమి పాలైంది. అనంతరం మల్లిక-భువన జోడి 6-2, 6-2తో నేహ-జ్యోతి జోడిను ఓడించి జట్టు విజయంలో కీలకపాత్ర వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ జట్టు 2-1తో జివాజి యూనివర్సిటీ జట్ట్టుపై గెలుపొందింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement