దుండిగల్, న్యూస్‌లైన్: జేఎన్‌టీయూహెచ్ జోనల్ ఇంటర్ కాలేజి టోర్నమెంట్‌లో జీఎన్‌ఐటీఎస్ ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకుంది. ఇక్కడి మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్‌ఆర్‌ఐటీ) కళాశాల గ్రౌండ్స్‌లో రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీలు శనివారం ముగిశాయి. ఇందులో వీఎన్‌ఆర్‌వీజేఐఈటీ జట్టు పురుషుల చాంపియన్‌గా, జీఎన్‌ఐటీఎస్ మహిళల చాంపియన్‌గా నిలిచాయి. క్రికెట్ పోటీల్లో 14 జట్లు పాల్గొనగా టీకేఆర్‌ఈసీ జట్టు టైటిల్ నెగ్గింది. ఫైనల్లో టీకేఆర్‌సీఈటీపై గెలుపొందింది.
వాలీబాల్ పురుషుల విభాగంలో వీఎన్‌ఆర్‌వీజేఐఈటీ, మహిళల విభాగంలో జీఎన్‌ఐటీఎస్ టైటిల్స్ గెలిచాయి. బాస్కెట్‌బాల్ పురుషుల విభాగంలో వీఎన్‌ఆర్‌వీజేఐఈటీ, మహిళల విభాగంలో జీఎన్‌ఐటీఎస్ నెగ్గాయి. త్రోబాల్ మహిళల విభాగంలో జీఎన్‌ఐటీఎస్, టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో ఎంఎల్‌ఆర్‌ఐటీ (సింగిల్స్), జేఎన్‌టీయూ (డబుల్స్) జట్లు విజేతలుగా నిలిచాయి.
మహిళల విభాగంలో జీఎన్‌ఐటీఎస్ (సింగిల్స్, డబుల్స్) గెలుపొందగా, షటిల్ బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో జేఎన్‌టీయూ (సింగిల్స్), వీఎన్‌ఆర్‌వీజేఐఈటీ (డబుల్స్), మహిళల విభాగంలో వీఎన్‌ఆర్‌వీజేఐఈటీ (సింగిల్స్, డబుల్స్) గెలిచాయి. విజేతలకు దుండిగల్ సీఐ బాలకృష్ణ, కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి బహుమతులు అందజేశారు.
ఓవరాల్ చాంప్ జీఎన్‌ఐటీఎస్
Published Sun, Feb 9 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM
Advertisement
Advertisement