సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి ఇంటర్ కాలేజి టోర్నీ (‘బిట్స్’ ఓపెన్ స్పోర్ట్స్ మీట్)లో నగరానికి చెందిన లయోలా కాలేజి జట్టు సత్తా చాటింది. బిట్స్ పిలానీ (రాజస్థాన్)లో ఇటీవలే ముగిసిన ఈ టోర్నీలో లయోలా జట్టు వాలీబాల్ విజేతగా నిలిచింది. ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజి వాలీబాల్ చాంపియన్ కూడా అయిన లయోలా, ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ స్థాయి టైటిల్ నెగ్గిన తొలి కాలేజి కావడం విశేషం. లీగ్ దశతో పాటు చివరి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా లయోలా జట్టు విజేతగా నిలిచింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో 25-17, 25-15, 25-19 స్కోరుతో ఐపీఎస్ అకాడమీ (చండీగఢ్)పై లయోలా విజయం సాధించింది. అంతకు ముందు సెమీఫైనల్లో లయోలా 25-17, 25-16, 25-19తో టోర్నీ ఫేవరేట్ బిట్స్ పిలానీ టీమ్‌ను ఓడించింది.
బాస్కెట్‌బాల్‌లో కూడా మెరుగ్గా రాణించిన హైదరాబాద్ జట్టు సెమీఫైనల్లో ఓటమిని ఎదుర్కొంది. క్వార్టర్ ఫైనల్లో భారత ఆటగాళ్లతో నిండిన ఎస్‌ఆర్‌సీసీ-ఢిల్లీపై 79-67 స్కోరుతో సంచలన విజయం సాధించిన లయోలా... సెమీస్‌లో లక్ష్మీబాయి నేషనల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ (గ్వాలియర్) చేతిలో 67-76 తేడాతో పరాజయంపాలైంది.
వారెవ్వా... లయోలా
Published Wed, Sep 25 2013 11:39 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement