జింబాబ్వేపై పాక్ విజయం | pakisthan won with zimbabwe | Sakshi
Sakshi News home page

జింబాబ్వేపై పాక్ విజయం

Published Fri, Aug 30 2013 3:00 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM

pakisthan won with zimbabwe

హరారే: తొలి మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఎదురైన అనూహ్య పరాజయంనుంచి పాకిస్థాన్ కోలుకుంది. ఇక్కడి స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో గురువారం జరిగిన రెండో వన్డేలో పాక్ 90 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. మొహమ్మద్ హఫీజ్ (130 బంతుల్లో 136 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగడంతో పాటు ఉమర్ అమిన్ (71 బంతుల్లో 59; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయడంతో... ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది.
 
  ఆఫ్రిది (23 బంతుల్లో 39 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు), జంషెద్ (45 బంతుల్లో 32; 3 ఫోర్లు) రాణించారు. అనంతరం జింబాబ్వే 42.4 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ బ్రెండన్ టేలర్ (95 బంతుల్లో 79; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, వాలర్ (42 బంతుల్లో 40; 6 ఫోర్లు), విలియమ్స్ (38 బంతుల్లో 37; 4 ఫోర్లు) కొద్ది సేపు పోరాడారు. పాక్ బౌలర్లలో జునేద్ ఖాన్ కేవలం 15 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. రెహమాన్, అజ్మల్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి. తాజా ఫలితంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement