పట్నాకు నాలుగో విజయం | Patna beat Bengaluru 31-25 at home | Sakshi
Sakshi News home page

పట్నాకు నాలుగో విజయం

Published Fri, Jul 8 2016 2:13 AM | Last Updated on Mon, Sep 4 2017 4:20 AM

పట్నాకు నాలుగో విజయం

పట్నాకు నాలుగో విజయం

పట్నా: ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్‌లో చాంపియన్ పట్నా పైరేట్స్ ఎదురులేకుండా దూసుకెళుతోంది. సొంత వేదికపై గురువారం  జరిగిన మ్యాచ్‌లో పట్నా 31-25 తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలిచింది. ఇది పట్నాకు వరుసగా నాలుగో విజయం. ప్రదీప్ నర్వాల్ 8, రాజేశ్ మొండల్ 6 రైడింగ్ పాయింట్లతో అదరగొట్టారు.


బెంగళూరు నుంచి రోహిత్ కుమార్ 7 పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. మ్యాచ్ ఆరంభం నుంచే స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్లిన పట్నాను బుల్స్ ఏ దశలోనూ అడ్డుకోలేకపోయింది. 12వ నిమిషంలో 8-8తో సమానంగా నిలిచినా ఆ తర్వాత వెనుకబడి పరాజయం పాలైంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement