
లండన్ : వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో భారత్ తలపడిన మ్యాచ్‌లో భారత విజయాన్ని ఆస్వాదిస్తూ ఇంటర్‌నెట్ సెన్సేషన్‌గా మారిన 87 ఏళ్ల చారులతా పటేల్‌కు పెప్పీ కంపెనీ తన డిజిటల్ క్యాంపెయిన్‌లో భాగస్వామ్యం కల్పించింది. భారత అభిమానిగా బామ్మ ఆనందంతో కేరింతలు కొట్టిన క్రమంలో మ్యాచ్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఏకంగా స్టాండ్స్‌లోకి వచ్చి చారులతా పటేల్‌ను కలిసిన సంగతి తెలిసిందే.
వయసు మీద పడినా భారత క్రికెట్ అభిమానిగా ఆమె చూపిన స్పిరిట్‌కు గౌరవంగా బ్రాండ్ పెప్సీ ఆమెతో డిజిటల్ క్యాంపెయిన్‌లో భాగస్వామ్యంపై కలిసి పనిచేస్తుందని పెప్సీ కో ఓ ప్రకటనలో పేర్కొంది. ఎనిమిది పదుల వయసు దాటినా భారత క్రికెట్ అభిమానిగా ఆమె అందరిలో ప్రేరణ నింపడం అభినందనీయమని తెలిపింది. కాగా తాను భారత క్రికెట్ జట్టుకు దశాబ్ధాల నుంచి వీరాభిమానిగా కొనసాగుతున్నానని, 1983లో కపిల్ సేన ప్రపంచ కప్‌ను ముద్దాడిన సమయంలో తాను అదే స్టేడియంలో ఉన్నానని ఆమె గుర్తుచేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment