సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ ట్రోఫీ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ సెంచరీల మోత మోగించారు. కెప్టెన్ ప్రజ్ఞయ్ రెడ్డి (285 బంతుల్లో 212; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) డబుల్ సెంచరీతో విజృంభించగా, ఎ. వరుణ్ గౌడ్ (233 బంతుల్లో 165; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. వీరిద్దరూ బ్యాటింగ్‌లో చెలరేగడంతో హైదరాబాద్ రెండోరోజు ఆటలో భారీస్కోరును సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 308/2తో సోమవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ 155 ఓవర్లలో 4 వికెట్లకు 633 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
69 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండోరోజు ఆటను ప్రారంభించిన ఓవర్ నైట్ బ్యాట్స్‌మన్ ప్రజ్ఞయ్ రెడ్డి 147 బంతుల్లో సెంచరీని, 276 బంతుల్లో డబుల్ సెంచరీని అందుకున్నాడు. వరుణ్ గౌడ్ 171 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 360 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జట్టు స్కోరు 603 పరుగుల వద్ద రోహిత్ సింగ్ బౌలింగ్‌లో ఎస్‌ఎస్ పాల్‌కు క్యాచ్ ఇచ్చి వరుణ్ అవుటయ్యాడు. మరో 3 పరుగుల్లోపే ప్రజ్ఞయ్ రెడ్డి కూడా వెనుదిరిగాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన త్రిపుర రెండోరోజు ఆట ముగి సే సమయానికి 25 ఓవర్లలో 2 వికెట్లకు 46 పరుగులు చేసింది. తన్మోయ్ దాస్ (26 బ్యా టింగ్), డీబీ దేబ్‌బర్మ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. హైదరాబాద్ బౌలర్లలో సి. రక్షణ్ రె డ్డి, అజయ్‌దేవ్ గౌడ్ చెరో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment