
ముంబా చేతిలో బుల్స్ చిత్తు
బెంగళూరు: సొంతగడ్డపై ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లను బెంగళూరు బుల్స్ పరాజయంతో ప్రారంభించింది. బుధవారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో యు ముంబా 7 పాయింట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబా 36-29తో బుల్స్‌ను మట్టికరిపించింది. తొలి అర్ధ భాగం ముగిసే సరికి 18-13తో ముందంజలో నిలిచిన ముంబా చివరి వరకు దానిని నిలబెట్టుకుంది. ముంబా జట్టు తరఫున జీవా కుమార్ 6 పాయింట్లు సాధించగా, సురేందర్, మోహిత్ చెరో 5 పాయింట్లు స్కోర్ చేశారు. బెంగళూరు ఆటగాళ్లలో మన్‌జీత్ 7, ధర్మరాజ్ 6 పాయింట్లు సాధించినా తమ జట్టును ఓటమినుంచి రక్షించలేకపోయారు.
ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు
బెంగాల్ వారియర్స్ పుణేరీ పల్టన్
రా. గం. 8 నుంచి
బెంగళూరు బుల్స్ జైపూర్ పింక్ పాంథర్స్
రా. గం. 9 నుంచి
స్టార్ స్పోర్ట్స్- 2లో ప్రత్యక్ష ప్రసారం