గుజరాత్‌కు ఆధిక్యం
రాణించిన పార్థివ్, జునేజా
ముంబైతో రంజీ ట్రోఫీ ఫైనల్
ఇండోర్: తొలి రోజు బౌలర్లు రాణించగా... రెండో రోజు బ్యాట్స్‌మెన్ బా ధ్యతాయుతంగా ఆడటంతో... ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో గుజరాత్ జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. ఓవర్‌నైట్ స్కోరు 2/0తో రెండో రోజు బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన గుజరాత్... ఆట ముగిసే సమయానికి 92 ఓవర్లలో ఆరు వికెట్లకు 291 పరుగులు సాధించింది. కెప్టెన్ పార్థివ్ పటేల్ (90; 12 ఫోర్లు), మన్‌ప్రీత్ జునేజా (77; 11 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 120 పరుగులు జోడించి గుజరాత్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంలో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు 37 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన గుజరాత్‌ను జునేజా, భార్గవ్ (45; 7 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 69 పరుగులు జతచేశారు. ప్రస్తుతం గుజరాత్ 63 పరుగుల ఆధిక్యంలో ఉండగా... చేతిలో నాలుగు వికెట్లున్నాయి. చిరాగ్ గాంధీ (17 బ్యాటింగ్), కలారియా (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ముంబై బౌలర్లలో అభిషేక్ నాయర్ మూడు వికెట్లు తీశాడు.