అమ్మవారి దయవల్లే... | Rio Olympics silver medallist P.V. Sindhu visits Lal Darwaza temple in Hyderabad | Sakshi
Sakshi News home page

అమ్మవారి దయవల్లే...

Published Sun, Aug 28 2016 1:46 AM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

అమ్మవారి దయవల్లే...

అమ్మవారి దయవల్లే...

సాక్షి, హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు శనివారం లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకుంది. ఒలింపిక్స్‌కు ముందు బోనం ఇచ్చిన సింధు... మరోసారి ఆలయానికి వచ్చి మొక్కు తీర్చుకుంది. ‘ఒలింపిక్స్‌లో పతకం నెగ్గితే మరోసారి వస్తానని మొక్కుకున్నాను. ఈరోజు నా మొక్కు తీర్చుకున్నాను’ అని సింధు తెలిపింది. మరోవైపు నేడు (ఆదివారం) సచిన్ చేతుల మీదుగా సింధు కారును బహుమానంగా అందుకోనుంది. కాంస్యం గెలిచిన రెజ్లర్ సాక్షి మలిక్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కూడా ఆదివారం హైదరాబాద్ రానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement