సచిన్.. క్రికెట్ దేవుడు: శ్రీకాంత్
భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్పై మాజీ క్రికెటర్ శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. క్రికెట్ సచిన్ దేవుడు లాంటి వాడని అభివర్ణించారు. తన 200వ టెస్టు అనంతరం క్రికెట్కు వీడ్కోలు పలకనున్నట్టు మాస్టర్ ప్రకటించిన నేపథ్యంలో శ్రీకాంత్ స్పందించారు.
మాస్టర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సుదీర్ఘ కెరీర్లో సచిన్ నెలకొల్పిన రికార్డులను బద్దలుకొట్టడం ఎవరికీ సాధ్యంకాదని శ్రీకాంత్ అన్నారు. సచిన్ తొలి మ్యాచ్ నుంచి ఇప్పటి వరకు నిలకడైన ఆటతీరుతో ఒకేలా ఆడుతున్నాడన్నారు.