బాలీవుడ్ తెరపై సచిన్ మెరుపులు! | sachin tendulkar to star in bollywood movie soon | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ తెరపై సచిన్ మెరుపులు!

Published Thu, Jan 8 2015 3:00 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బాలీవుడ్ తెరపై సచిన్ మెరుపులు! - Sakshi

బాలీవుడ్ తెరపై సచిన్ మెరుపులు!

త్వరలోనే ఫోర్లు, సిక్సర్ల వరద మళ్లీ పారనుంది. మాస్టర్ బ్లాస్టర్ మెరుపులను అభిమానులంతా ఇంకోసారి చూడొచ్చు. అదేంటి.. దాదాపు ఏడాదిన్నర క్రితమే రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ టెండూల్కర్ మళ్లీ బ్యాటు పడతాడా అని ఆలోచిస్తున్నారా? పడతాడు.. కానీ నిజజీవితంలో కాదు.. వెండితెర మీద!! అవును సచిన్ టెండూల్కర్ త్వరలోనే బాలీవుడ్ రంగప్రవేశం చేయబోతున్నాడు. ఆయన జీవితం ఆధారంగా తీయబోతున్న ఓ సినిమాలో స్వయంగా సచినే తన పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకు ఇంకా పేరు కూడా పెట్టలేదు. అయితే.. మాస్టర్ క్రికెట్ జీవితం, వ్యక్తిగత జీవితాలను ఈ సినిమాలో పూర్తి స్థాయిలో ప్రతిబింబిస్తారట. సినిమాలో నటించడంతో పాటు స్క్రిప్టు విషయంలో కూడా మాస్టర్ సాయం చేస్తున్నాడు.

ముంబైకి చెందిన 200 నాటౌట్ అనే నిర్మాణ సంస్థ ఈ సినిమా తీస్తోంది. ఇప్పటికి 150కి పైగా ప్రకటనలు, షార్ట్ ఫిలింలు తీసిన అనుభవం ఈ సంస్థకు ఉంది. ఈ సంస్థ సచిన్తో సినిమా తీసే హక్కులను వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ (డబ్ల్యుఎస్జి) నుంచి తీసుకుంది. లండన్కు చెందిన ప్రముఖ రచయిత, దర్శకుడు, నిర్మాత జేమ్స్ ఎర్స్కైన్కు ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నారు. టెండూల్కర్ బ్రాండు, వాణిజ్య ప్రయోజనాలన్నింటినీ డబ్ల్యుఎస్జీ మేనేజ్ చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పనులు ఏడాది క్రితమే మొదలయ్యాయి. ప్రస్తుతం షూటింగు కూడా జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement