పదేళ్లుగా ప్రేమించుకుంటున్న భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లు జంటగా మారబోతున్నారు. నేడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నారు. హైదరాబాద్ రాయదుర్గంలోని సైనా నివాసం ‘ఒరియన్ విల్లా’లో కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత ఆప్తుల మధ్య శుక్రవారం వీరి వివాహం జరగనుంది. ఈ వేడుకలకు గవర్నర్ నరసింహన్, విమల దంపతులు ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నారు. రిజిస్టర్‌మ్యారేజ్ చేసుకోనున్న సైనా, కశ్యప్‌లు రిసెప్షన్‌ను మాత్రం వైభవంగా జరుపుకోనున్నారు.ఈ నెల 16న హైటెక్ సిటీలోని నోవాటెల్ హోటల్‌లో జరిగే వేడుకల్లో బాలీవుడ్, టాలీవుడ్ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్,దగ్గుబాటి సురేష్‌లతో పాటు ‘అగిలే గ్రూప్ హైదరాబాద్ హంటర్స్’ చీఫ్ ఎండీవీఆర్‌కే రావు, మంత్రి కేటీఆర్, చాముండేశ్వరీనాథ్, రాజకీయ ప్రముఖులకురిసెప్షన్ ఆహ్వాన పత్రికలను అందజేశారు.
హిమాయత్‌నగర్: తెలుగువారి కీర్తి, ప్రతిష్టలను, క్రీడా ప్రతిభను ప్రపంచానికి చాటిన బ్యాడ్మింటన్ స్టార్లు జంటగా నేడు ఓ ఇంటివారు కానున్నారు. పదేళ్లుగా ప్రేమలో ఉన్నామని ఇటీవల ప్రకటించిన సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ శుక్రవారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నారు. ఇందుకు రాయదుర్గంలోని సైనా నివాసం వేదిక కానుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు కూడా హాజరవుతున్న ఈ ‘రాకెట్ స్టార్స్’ వివాహ వేడుక
సవ్యసాచి ఔట్‌ఫిట్‌లో..
నోవాటెల్‌లో జరిగే రిసెప్షన్‌కి సైనా, కశ్యప్ దంపతులు సవ్యసాచి ఔట్‌ఫిట్‌తో చేసిన దుస్తులు ధరించనున్నారు. సైనా ‘లెహంగా విత్ వెల్‌వెట్ దుప్పాట’ దుస్తులు, డైమండ్ జ్యువెలరీతో మెరవనుంది. కశ్యప్ షేర్వానీ విత్ పెన్ జ్యువెలరీలో కనిపించనున్నారు. వీరిస్టైలిష్ట్‌ని ప్రముఖ డిజైనర్ శ్రావ్యవర్మ చూస్తున్నారు.
లెహంగా.. కుర్తీ.. సింప్లిసిటీ..
నేడు జరగనున్న పెళ్లికి మాత్రం సైనా, కశ్యప్ చాలా సింప్లిసిటీ వస్త్రధారణలో కనిపించనున్నారు. సైనా లెహంగాను, కశ్యప్ బేబీ పింక్ కుర్తా అండ్ షేర్వానీ ధరించనున్నారు. 15వ తేదీ రాత్రి 40మంది తోటి క్రీడాకారులకు ‘కాక్‌టైల్ పార్టీ’ ఇవ్వనున్నారు. ఈ పార్టీలో సైనా గౌన్‌లో, కశ్యప్ పౌడర్ బ్లూ సూట్‌లో కనిపించనున్నట్లు స్టైలిస్ట్ శ్రావ్యవర్మ తెలిపారు.
కొత్తగా కనిపిస్తారు..
సైనా, కశ్యప్‌లిద్దరూ పదిహేను రోజులుగా సభ్యసాచి ఔట్‌ఫిట్ దుస్తులు ధరించనున్నారు. ఇంతకు మునుపెన్నడూ చూడని సైనా, కశ్యప్‌లను రిసెప్షన్‌లో చూపించనున్నాను. – శ్రావ్యవర్మ, స్టైలిస్ట్
రిసెప్షన్‌కు సెలబ్రిటీలు
నోవాటెల్‌లో జరిగే రిసెప్షన్‌లో బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ సందడి చేయనున్నారు. రణ్‌వీర్‌సింగ్, దీపిక, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ధోని, సమంత, రకూల్‌ప్రీత్ సింగ్, కీర్తిసురేష్, మిథాలీరాజ్, పీవీ సింధు, గోపీచంద్, అశ్విని పొన్నప్ప తదితరులు హాజరు కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment