క్వార్టర్స్ కు చేరిన సైనా | saina nehwal enters into quarter final | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్ కు చేరిన సైనా

Published Thu, May 28 2015 4:06 PM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM

క్వార్టర్స్ కు చేరిన సైనా

క్వార్టర్స్ కు చేరిన సైనా

సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్  దూసుకుపోతోంది. గురువారం జరిగిన ప్రి క్వార్ట్రర్ పోరులో సైనా నెహ్వాల్ 21-19, 19-21,21-14 తేడాతో ప్రపంచ 9వ ర్యాంకర్ సున్ యు (చైనా)ను బోల్తాకొట్టించి క్వార్టర్ కు చేరింది. ఈ పోరులో తొలి సెట్ ను కష్టపడి గెలిచిన సైనా.. రెండో గేమ్ ను కోల్పోయింది.

 

కాగా  నిర్ణయాత్మక మూడో గేమ్ లో సైనా ఆకట్టకుంది. తన అనుభవాన్ని ఉపయోగించి సున్ యు పై పైచేయి సాధించింది. దీంతో ఈ ఇద్దరి క్రీడాకారుణుల ముఖాముఖి రికార్డును సైనా మరింత మెరుగుపరుచుకుంది.ఇప్పటివరకూ వీరిద్దరి మధ్య ఐదు మ్యాచ్ లు జరగ్గా.. నాలుగింటిలో సైనా విజయం సాధించింది.

 

ముగిసిన శ్రీకాంత్ పోరు

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ పోరు ముగిసింది.  రెండో రౌండ్ లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్ లో  ప్రపంచ నంబర్ నాల్గో నంబర్ ఆటగాడు శ్రీకాంత్ 21-18, 17-21, 13-21 తేడాతో చైనీస్ ఆటగాడు తియాన్ హువీ  చేతిలో ఓటమి చెంది టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించాడు. తొలి గేమ్ ను అవలీలగా గెలుచుకున్న శ్రీకాంత్ ఆ తరువాత బొక్క బోర్లాపడ్డాడు. వరుస గేమ్ లను చేజార్చుకుని పరాజయం చెందాడు. కేవలం ఒక గంటా ఎనిమిది నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీకాంత్ ఆశించినంతంగా ఆకట్టుకోలేదు.

ఇదిలా ఉండగా మహిళల విభాగంలో జ్వాలా-అశ్వినల జోడి కూడా నిరాశ పరిచారు. ఇండోనేషియా జోడీ నిత్యా క్రిషిందా మహేశ్వరి -రేసియా చేతిలో 21-14, 21-10 తేడాతో జ్వాల జోడి ఓటమి పాలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement