Defending champion status
-
సిస్టర్స్ సులభంగా...
* వింబుల్డన్ సెమీస్‌లో సెరెనా, వీనస్ * కెర్బర్, వెస్నినా కూడా... లండన్: డిఫెండింగ్ చాంపియన్ హోదాను కొనసాగిస్తూ చెల్లెలు... ఏడేళ్ల తర్వాత సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటూ అక్క... వింబుల్డన్‌లో అమెరికా సిస్టర్స్ సెరెనా, వీనస్‌లు చెలరేగిపోయారు. స్థాయికి తగ్గ ప్రదర్శనతో ప్రత్యర్థులపై ఆధిపత్యం కొనసాగిస్తూ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకు వేశారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో టాప్‌సీడ్ సెరెనా 6-4, 6-4తో 21వ సీడ్ అనస్థాసియా పావులుచెంకోవా (రష్యా)పై; 8వ సీడ్ వీనస్ 7-6 (7/5), 6-2తో యారోస్లోవా ష్వెదోవా (కజకిస్తాన్)పై నెగ్గి సెమీస్‌లోకి దూసుకెళ్లారు. పావులుంచెకోవాతో గంటా 12 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సెరెనా వ్యూహాత్మకంగా ఆడింది. భారీ సర్వీస్‌లతో కాకుండా తెలివిగా చిన్న చిన్న షాట్స్‌తో ప్రత్యర్థిని కట్టిపడేసింది. తొలిసెట్లో ఇరువురు చెరో నాలుగు గేమ్‌ల్లో సర్వీస్‌ను నిలబెట్టుకున్నారు. కానీ తొమ్మిదో గేమ్‌లో పావులుచెంకోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా.. ఆ వెంటనే సర్వీస్‌ను కాపాడుకుని సెట్‌ను నిలబెట్టుకుంది. రెండోసెట్‌లోనూ ఇదే తరహా ఫలితాన్ని పునరావృతం చేసి సెట్‌ను, మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. మార్టినా నవ్రోతిలోవా (1994లో) తర్వాత వింబుల్డన్ సెమీస్‌కు చేరిన ఎక్కువ వయసు మహిళగా రికార్డులకెక్కిన 36 ఏళ్ల వీనస్... క్వార్టర్స్ మ్యాచ్‌లో ఆకట్టుకుంది. 2008లో చివరిసారి ఇక్కడ టైటిల్ గెలిచిన వీనస్... 2010 యూఎస్ ఓపెన్ తర్వాత మళ్లీ గ్రాండ్‌స్లామ్‌లో సెమీస్‌కు చేరడం ఇదే తొలిసారి. ష్వెదోవాతో గంటా 42 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ఇరువురు సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో స్కోరు 6-6తో సమమైంది. అయితే టైబ్రేక్‌లో వీనస్ వరుసగా సర్వీస్‌లను కాపాడుకుంటూ సెట్‌ను చేజిక్కించుకుంది. ఇక రెండోసెట్లో ఒకసారి సర్వీస్‌ను కోల్పోయిన వీనస్ మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో నాలుగోసీడ్ కెర్బర్ (జర్మనీ) 7-5, 7-6 (7/2)తో ఐదోసీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై; ఎలెనా వెస్నినా (రష్యా) 6-2, 6-2తో 19వ సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా)పై గెలిచారు. సెమీస్‌లో సెరెనా... వెస్నినాతో; వీనస్... కెర్బర్తో తలపడతారు. సానియా జోడీకి చుక్కెదురు మిక్స్డ్ డబుల్స్‌లో భారత స్టార్ సానియా మీర్జా-ఇవాన్ డుడిగ్ (క్రొయేషియా) జోడికి చుక్కెదురైంది. రెండోరౌండ్లో టాప్‌సీడ్ సానియా-డుడిగ్ 6-4, 3-6, 5-7తో బ్రిటన్ జంట నీల్ స్కుపిస్కీ-అనా స్మిత్‌ల చేతిలో ఓడారు. దాదాపు రెండు గంటలకుపైగా సాగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడీలు చెరో సెట్‌ను సాధించాయి. మూడో గేమ్‌లో బ్రేక్ పాయింట్‌తో తొలిసెట్‌ను చేజిక్కించుకున్న సానియా ద్వయం... రెండోసెట్లో వరుసగా సర్వీస్‌లను చేజార్చుకున్నారు. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో ఓ దశలో సానియా-డుడిగ్ 5-3 ఆధిక్యంలో నిలిచారు. అయితే కీలకమైన తొమ్మిదో గేమ్‌లో స్కోరు 40-30 వద్ద మ్యాచ్ పాయింట్‌ను చేజార్చుకున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న బ్రిటన్ జోడి భారీ సర్వీస్‌లతో చెలరేగిపోయింది. మరోసారి మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకుని ప్రత్యర్థి ఆధిక్యాన్ని 4-5కు తగ్గించారు. తర్వాత సర్వీస్‌ను కాపాడుకుని మ్యాచ్‌లో నిలిచారు. ఇక 11వ గేమ్‌లో సానియా జోడి సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో పాటు 12వ గేమ్‌లో తమ సర్వీస్‌ను నిలబెట్టుకుని సెట్‌ను మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. బాలికల రెండోరౌండ్లో కర్మన్ కౌర్ (భారత్) 6-4, 2-6, 2-6తో బోల్క్వెడ్జ్ (జార్జియా) చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో రోహన్ బోపన్న (భారత్)-రొడినోవా (ఆస్ట్రేలియా) జంటకు ఓటమి ఎదురైంది. కొలంబియా ద్వయం కాబెల్-మారినో 7-6 (7/5), 6-3తో బోపన్న జోడిపై నెగ్గింది. -
సైనాకు చుక్కెదురు
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సిడ్నీ: డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సైనా నెహ్వాల్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో చుక్కెదురైంది. ప్రపంచ ఆరో ర్యాంకర్ షిజియాన్ వాంగ్ (చైనా)తో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, రెండో సీడ్ సైనా 15-21, 13-21తో ఓడిపోయింది. 41 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనా ఏదశలోనూ తన ప్రత్యర్థి జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయింది. సైనాతో 12వ సారి ఆడుతోన్న షిజియాన్‌కు సైనా బలాబలాలపై అవగాహన ఉండటంతో పక్కా ప్రణాళికతో ఆడి అనుకున్న ఫలితాన్ని సాధించింది. గతేడాది ఇదే టోర్నీలో సైనా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ విజయంతో ముఖాముఖి రికార్డులో సైనా, షిజియాన్ 6-6తో సమంగా ఉన్నారు. ఈ ఓటమితో సైనా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ మరోసారి చేజారే అవకాశముంది. -
క్వార్టర్స్ కు చేరిన సైనా
సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ దూసుకుపోతోంది. గురువారం జరిగిన ప్రి క్వార్ట్రర్ పోరులో సైనా నెహ్వాల్ 21-19, 19-21,21-14 తేడాతో ప్రపంచ 9వ ర్యాంకర్ సున్ యు (చైనా)ను బోల్తాకొట్టించి క్వార్టర్ కు చేరింది. ఈ పోరులో తొలి సెట్ ను కష్టపడి గెలిచిన సైనా.. రెండో గేమ్ ను కోల్పోయింది. కాగా నిర్ణయాత్మక మూడో గేమ్ లో సైనా ఆకట్టకుంది. తన అనుభవాన్ని ఉపయోగించి సున్ యు పై పైచేయి సాధించింది. దీంతో ఈ ఇద్దరి క్రీడాకారుణుల ముఖాముఖి రికార్డును సైనా మరింత మెరుగుపరుచుకుంది.ఇప్పటివరకూ వీరిద్దరి మధ్య ఐదు మ్యాచ్ లు జరగ్గా.. నాలుగింటిలో సైనా విజయం సాధించింది. ముగిసిన శ్రీకాంత్ పోరు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ పోరు ముగిసింది. రెండో రౌండ్ లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్ లో ప్రపంచ నంబర్ నాల్గో నంబర్ ఆటగాడు శ్రీకాంత్ 21-18, 17-21, 13-21 తేడాతో చైనీస్ ఆటగాడు తియాన్ హువీ చేతిలో ఓటమి చెంది టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించాడు. తొలి గేమ్ ను అవలీలగా గెలుచుకున్న శ్రీకాంత్ ఆ తరువాత బొక్క బోర్లాపడ్డాడు. వరుస గేమ్ లను చేజార్చుకుని పరాజయం చెందాడు. కేవలం ఒక గంటా ఎనిమిది నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీకాంత్ ఆశించినంతంగా ఆకట్టుకోలేదు. ఇదిలా ఉండగా మహిళల విభాగంలో జ్వాలా-అశ్వినల జోడి కూడా నిరాశ పరిచారు. ఇండోనేషియా జోడీ నిత్యా క్రిషిందా మహేశ్వరి -రేసియా చేతిలో 21-14, 21-10 తేడాతో జ్వాల జోడి ఓటమి పాలైంది. -
సైనా అలవోకగా...
♦ శ్రమించి నెగ్గిన శ్రీకాంత్ ♦ పోరాడి ఓడిన సింధు, కశ్యప్, గురుసాయిదత్ ♦ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ సిడ్నీ: డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో తన టైటిల్ వేటను ప్రారంభించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సైనా 21-12, 21-10తో లిడియా యి యు (మలేసియా)పై అలవోకగా గెలిచింది. 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా పూర్తి ఆధిపత్యం చలాయించింది. తొలి గేమ్‌లో ఒకదశలో 3-5తో వెనుకబడ్డ ఈ హైదరాబాద్ అమ్మాయి ఆ తర్వాత వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 8-5తో ముందంజ వేసింది. అదే జోరులో ఈసారి వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించి 17-7తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో గేమ్ ఆరంభంలో వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి 11-2తో దూసుకెళ్లిన సైనా అటునుంచి వెనుదిరిగి చూడలేదు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 9వ ర్యాంకర్ సున్ యు (చైనా)తో సైనా తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సైనా 3-1తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు మూడు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన హైదరాబాద్ అమ్మాయి పీవీ సింధు తుదికంటా పోరాడినా విజయాన్ని దక్కించుకోలేకపోయింది. ఎనిమిదో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా)తో 72 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సింధు 21-18, 15-21, 23-25తో పోరాడి ఓడింది. చివరి గేమ్‌లో సింధు ఒక మ్యాచ్ పాయింట్‌ను చేజార్చుకోవడం గమనార్హం. ఓటమి అంచుల నుంచి... పురుషుల సింగిల్స్ విభాగంలో నాలుగో సీడ్ కిడాంబి శ్రీకాంత్ నాలుగు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని విజయం సాధించగా... పారుపల్లి కశ్యప్ రెండు మ్యాచ్ పాయింట్లను వదులుకొని ఓడిపోయాడు. క్వాలిఫయర్ గురుసాయిదత్ ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా)కు చెమటలు పట్టించి పరాజయం పాలయ్యాడు. ప్రపంచ 14వ ర్యాంకర్ హాన్స్ క్రిస్టియన్ విటింగస్ (డెన్మార్క్)తో 53 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 14-21, 21-8, 22-20తో గెలిచాడు. చివరి గేమ్‌లో శ్రీకాంత్ 16-20తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచాడు. అయితే పట్టుదలతో పోరాడిన శ్రీకాంత్ అనూహ్యంగా వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 22-20తో విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ తియాన్ హువీ (చైనా)తో శ్రీకాంత్ ఆడతాడు. ప్రపంచ ఏడో ర్యాంకర్ జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా)తో 81 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ 26-24, 18-21, 20-22తో ఓడిపోయాడు. చివరి గేమ్‌లో కశ్యప్ 20-18తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ తన ప్రత్యర్థికి వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయి ఓటమి మూటగట్టుకున్నాడు. చెన్ లాంగ్‌తో 72 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో గురుసాయిదత్ 21-15, 9-21, 17-21తో ఓటమి చవిచూశాడు. మహిళల డబుల్స్ విభాగంలో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం 21-13, 21-13తో సమంతా బార్నింగ్-ఇరిస్ తబెలింగ్ (నెదర్లాండ్స్) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. -
సందడి మొదలైంది...
ముంబై కెప్టెన్‌గా పొలార్డ్ గాయంతో రోహిత్‌శర్మ లీగ్ నుంచి తప్పుకోవడంతో కీరన్ పొలార్డ్ ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న ముంబైకి నాయకత్వం వహించేందుకు పొలార్డ్ సరైన వ్యక్తి అని టీమ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్, సీఎల్‌టి20 కలిపి 96 మ్యాచ్‌లు ఆడిన పొలార్డ్ 1700 పరుగులు చేశాడు. - ప్రాక్టీస్‌లో మునిగిన ఆటగాళ్లు - ముంబై ఇండియన్స్‌పైనే అందరి దృష్టి - రేపటి నుంచి క్వాలిఫయర్స్ రాయ్‌పూర్: చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ క్వాలిఫయింగ్ దశలో ఇప్పుడు అందరి దృష్టీ ముంబై ఇండియన్స్‌పైనే ఉంది. రెండు సార్లు ఈ టోర్నీ చాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు ఈ సారి అర్హత పోటీల్లో పాల్గొంటోంది. ఈ దశలో పోటీ పడుతున్న మిగతా మూడు జట్లతో పోలిస్తే స్టార్ ఆటగాళ్లు, భారీ హిట్టర్లు ముంబై టీమ్‌లోనే ఉండటంతో అభిమానులు జట్టు మ్యాచ్‌ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే జట్టు రాయ్‌పూర్ చేరుకుంది. మెంటర్ అనిల్ కుంబ్లే నేతృత్వంలో ఆటగాళ్లంతా రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నారు. గత ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన రాయ్‌పూర్‌కు ఇప్పుడు మళ్లీ క్రికెట్ కళ వచ్చింది. టోర్నీలో భాగంగా ఆరు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతో పాటు మరో రెండు లీగ్ మ్యాచ్‌లు ఇక్కడి షహీద్ వీర్‌నారాయణ్ సింగ్ స్టేడియంలో జరగనున్నాయి. గురువారం ప్రాక్టీస్ చేసిన అనంతరం కొంతమంది ఆటగాళ్లు రాయ్‌పూర్‌లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గెలిస్తే గ్రూప్ ‘బి’లోకి... లాహోర్ లయన్స్, సదరన్ ఎక్స్‌ప్రెస్, నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ జట్లు తొలిసారి లీగ్ బరిలోకి దిగుతున్నాయి. క్వాలిఫయింగ్ బరిలో ఉన్న ముంబై ఇండియన్స్ ప్రధాన పోటీలకు అర్హత సాధిస్తే ఆ జట్టు గ్రూప్ ‘బి’ బరిలోకి దిగుతుంది. ఈ గ్రూప్‌లో మరో భారత జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఉంది. గ్రూప్ ‘ఎ’లో ఇప్పటికే కోల్‌కతా, చెన్నై ఉండటంతో మరో భారత జట్టును చేర్చకుండా షెడ్యూల్ రూపొందించారు. తప్పుకున్న దిల్షాన్ లీగ్ ఆరంభానికి ముందే శ్రీలంక జట్టు సదరన్ ఎక్స్‌ప్రెస్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన ఆటగాడు తిలకరత్నే దిల్షాన్ వ్యక్తిగత కారణాలతో టోర్నీకి దూరమయ్యాడు. ఇప్పటికే ఈ టీమ్ కీలక బౌలర్ మలింగ, సీఎల్‌టి20లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకోవడంతో జట్టు బలహీనంగా మారింది. టీమ్‌కు కెప్టెన్‌గా జీహాన్ ముబారక్‌ను ఆ జట్టు ప్రకటించింది.