సెయింట్ మార్టిన్స్ క్లబ్ గెలుపు | saint martins club beats nba by one point in basket ball tournament | Sakshi
Sakshi News home page

సెయింట్ మార్టిన్స్ క్లబ్ గెలుపు

Published Sun, Jul 24 2016 3:25 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

saint martins club beats nba by one point in basket ball tournament

క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్


హైదరాబాద్: క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో జరిగిన హోరాహోరీ పోరులో సెయింట్ మార్టిన్స్ క్లబ్ జట్టు పాయింట్ తేడాతో గట్టెక్కింది. సిటీ కాలేజి గ్రౌండ్స్‌లో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సెయింట్ మార్టిన్స్ 33-32తో నిజామ్ బాస్కెట్‌బాల్ అకాడమీ(ఎన్‌బీఏ)పై గెలిచింది. మార్టిన్స్ జట్టులో అఖిల్ (10), విశాల్ (8) రాణించగా, ఎన్‌బీఏ జట్టు తరఫున డుజాన్ 10, శ్రీకాంత్ 9 పాయింట్లు చేశారు. మరో మ్యాచ్‌లో బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ ‘బి’ జట్టు 35-30తో రాజేంద్రనగర్ బాస్కెట్‌బాల్ క్లబ్‌పై నెగ్గింది.

 

బాయ్స్ స్పోర్ట్స్ జట్టులో అమన్ (12), సచిన్ (10) ఆకట్టుకున్నారు. రాజేంద్రనగర్ జట్టులో సలీమ్ (24) ఒంటరి పోరాటం చేశాడు. సికింద్రాబాద్ వైఎంసీఏ కోర్టులో జరిగిన మ్యాచ్‌లో నెహ్రూ నగర్ ప్లేగ్రౌండ్స్ 48-27తో స్టూడెంట్స్ స్పోర్ట్స్ క్లబ్‌పై గెలుపొందింది. నెహ్రూనగర్ జట్టు తరఫున విపుల్ 16, భరత్ 10 పాయింట్లు చేశారు. స్టూడెంట్స్ జట్టులో సాయికిరణ్ 11, గోపాల్, చరణ్ చెరో 8 పాయింట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement