
కోల్‌కతా: భారత డేవిస్‌కప్ ఆటగాడు ప్రేమ్‌జీత్ లాల్ స్మారక జాతీయ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడైన సాకేత్ 6–3, 6–3తో హైదరాబాద్‌కు చెందిన విష్ణువర్ధన్‌ను ఓడించాడు.
ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్ 6–3, 6–3తో జీవన్ నెదున్‌చెజియాన్‌పై, శ్రీరామ్ బాలాజీ 6–0, 6–0తో శశికుమార్ ముకుంద్‌పై, విజయ్ సుందర్ ప్రశాంత్ 6–3, 1–6, 6–1తో సిద్ధార్థ్ రావత్‌పై గెలిచారు. సెమీఫైనల్స్‌లో శ్రీరామ్ బాలాజీతో సాకేత్; రామ్‌కుమార్‌తో ప్రశాంత్ తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment