సెమీస్‌లో సానియా జోడి | Sania Mirza-Martina Hingis continue winning, enter Wuhan semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సానియా జోడి

Published Fri, Oct 2 2015 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 10:18 AM

సెమీస్‌లో సానియా జోడి

సెమీస్‌లో సానియా జోడి

వుహాన్: వరుస విజయాలతో జోరు మీదున్న సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి... వూహాన్ ఓపెన్ డబ్ల్యుటీఏ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో టాప్‌సీడ్ సానియా-హింగిస్ 6-2, 6-2తో ఐదోసీడ్ రాక్వెల్ కోప్స్ జోన్స్-అబిగలి స్పీయర్స్ (అమెరికా)పై నెగ్గారు. తొలిరౌండ్‌లో బై పొందిన భారత్-స్విస్ ద్వయం ప్రిక్వార్టర్స్‌లో 6-3, 6-2తో క్లౌడియా జాన్స్ ఇగ్నాసిక్ (పోలెండ్)-అనాస్టాసియా రొడినోవా (ఆస్ట్రేలియా)పై గెలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement