సింగపూర్: ఈ ఏడాది జతగా ఎనిమిది టైటిల్స్ నెగ్గి అత్యద్భుతమైన ఫామ్‌లో ఉన్న సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట ఆఖరి సవాల్‌కు సిద్ధమైంది. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో ఈ ఇండో-స్విస్ ద్వయం డబుల్స్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. గతేడాది కారా బ్లాక్‌తో కలిసి డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించిన సానియా ఈసారి అదే ఫలితాన్ని పునరావృతం చేస్తుందో లేదో వేచి చూడాలి.
మొత్తం ఎనిమిది జంటలు రెండు గ్రూప్‌లుగా విడిపోయి లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో టైటిల్ కోసం తలపడతాయి. ‘రెడ్’ గ్రూప్‌లో సానియా-హింగిస్‌లతోపాటు తిమియా బాబోస్-మ్లాడెనోవిచ్; రాకెల్ కాప్స్‌జోన్స్-అబిగెయిల్; హలవకోవా-హర్డెకా... ‘వైట్’ గ్రూప్‌లో బెథానీ మాటెక్ సాండ్స్-లూసీ సఫరోవా; హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్; కరోలిన్ గార్సియా-స్రెబోత్నిక్; ముగురుజా-కార్లా నవారోలక చోటు కల్పించారు. ఇదే వేదికపై సింగిల్స్ టైటిల్స్ కోసం షరపోవా, సిమోనా హలెప్, అగ్నెస్కా రద్వాన్‌స్కా, ఫ్లావియా పెనెట్టా, ముగురుజా, పెట్రా క్విటోవా, ఎంజెలిక్ కెర్బర్, లూసీ సఫరోవా బరిలో ఉన్నారు.
సానియా జంటకు సవాల్
Published Sun, Oct 25 2015 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 11:25 AM
Advertisement
Advertisement