క్వార్టర్స్‌లో సానియా జంట | Sania Mirza-Martina Hingis in China Open quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సానియా జంట

Published Thu, Oct 8 2015 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 10:35 AM

క్వార్టర్స్‌లో సానియా జంట

క్వార్టర్స్‌లో సానియా జంట

 బీజింగ్: వరుసగా నాలుగో టైటిల్‌పై గురి పెట్టిన సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. టాప్ సీడ్ హోదాలో తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన ఈ ఇండో-స్విస్ జోడీ... బుధవారం జరిగిన రెండో రౌండ్‌లో 1-6, 6-4, 10-6తో ‘సూపర్ టైబ్రేక్’లో సారా ఎరాని-ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) జంటపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 76 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా ద్వయం తొలి సెట్‌ను కోల్పోయినా... రెండో సెట్‌లో వెంటనే తేరుకుంది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో సమన్వయంతో ఆడి విజయాన్ని ఖాయం చేసుకుంది.
 
 సానియా జోడీ 13 మ్యాచ్‌ల తర్వాత ప్రత్యర్థి జంటకు సెట్‌ను చేజార్చుకోవడం గమనార్హం. మరోవైపు ఇదే వేదికపై జరుగుతున్న ఏటీపీ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)-జాన్ ఇస్నెర్ (అమెరికా) జంటకు తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో బోపన్న-ఇస్నెర్ జోడీ 4-6, 3-6తో ట్రయెస్కీ (సెర్బియా)-పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) ద్వయం చేతిలో ఓడిపోయింది. బోపన్న ఓటమితో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా)తో జతకట్టిన లియాండర్ పేస్ కూడా తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement