
బీజింగ్:చైనా ఓపెన్ డబ్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్ లో సానియా మీర్జా(భారత్)- షుయె పెంగ్ (చైనా) జో్డి పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీ ఫైనల్లో సానియా ద్వయం 6-2, 1-6, 5-10 తేడాతో మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్)-చెన్ యంగ్ జన్(తైవాన్) చేతిలో పరాజయం చెందింది. తొలి సెట్ ను అవలీలగా గెలిచి మంచి ఊపు మీద కనిపించిన సానియా జంట.. ఆపై వరుస రెండు సెట్లను ఘోరంగా కోల్పోయి ఓటమిని కొనితెచ్చుకున్నారు.
శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బార్బరా స్ట్రికోవా–కాటరీనా సినియకోవా జంటపై చక్కటి విజయాన్ని సాధించిన సానియా జోడి.. సెమీస్ లో మాత్రం ఆశించిన మేర ఆకట్టుకోలేక టోర్నీ నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment