లీడ్స్: వికెట్ కీపింగ్‌లో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఓ ప్రత్యేకమైన స్టైల్ ఉంది. వికెట్ వంక చూడకుండా కూడా ధోని రనౌట్ చేయగలడు. కను రెప్ప పాటులో అతను బ్యాట్స్‌మెన్‌ని స్టంప్ చేసేస్తాడు. అందుకే అతని వికెట్ కీపింగ్‌కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే చాలా మంది ధోనిలా వికెట్ కీపింగ్ చేయబోయి విఫలమయ్యారు. తాజాగా ఈ జాబితాలో పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా చేరాడు.
ప్రపంచకప్‌లో భాగంగా శనివారం లీడ్స్ వేదికగా పాక్, అఫ్గానిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్ చివరి బంతికి ముజీబ్ రెండు పరుగులు తీసేందుకు ప్రయత్నించాడు. అయితే ఫీల్డర్ బంతికి కీపర్ సర్ఫరాజ్‌కు అందించగా.. అతను వికెట్లను చూడకుండానే రనౌట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ బంతికి వికెట్ల నుంచి దూరంగా వెళ్లడంతో బ్యాట్స్‌మెన్ రనౌట్ కాకుండా తప్పించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment